రెండవ గజల్

                కె.ఎన్.ఆర్ రెండవ గజల్
================================
కె.ఎన్.ఆర్

గతమెప్పుడు గాయంలా గడిచిందని తెలియలేదా!
నిజమెప్పుడు నిప్పులా రగిలిందని తెలియలేదా!!

ఎన్నాల్లకెన్నాళ్లకు కాలం మారుతూ చెప్పిందో నాకు!
మనిషి మర్మం ఏ చాటునో నిలిచిందని తెలియలేదా!!

అనుభవాల గుణపాఠమే నేర్చుకుంటూ కదిలాను!
నీలో అంతరంగ భావ తరంగమే వెలిగిందని తెలియలేదా!!

కలం చిమ్మిన అక్షరాలనే ఆయుధాలుగా మార్చి!
నీ మాట సజీవమై కదిలిందని తెలియలేదా!!

మరుక్షణం మరణమే రావచ్చు కదా "కె.ఎన్.ఆర్"!
అలుపెందుకు శ్వాసకు ఆరడుగులుందని తెలియలేదా!!


                           నవీన్ రెడ్డి
                       అభ్యుదయ కవి

Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!