ఆచరణలతో చేసే యుద్ధం


చీకట్లో యుద్ధం
కంటికి కనపడని శత్రువు
చేసెను విద్వంసం
అయోమయం
అంతా అగమ్య గోచరం
భవిష్యత్ కోసం
భయపడిన జనం
మనం విలువ తెలిసి
రక్షణ ఎట్లా
బతకడం ప్రశ్న
ప్రపంచం అంతా విస్తరణ
ప్రకృతికి మానవుడు తినేస్తే
వీడిని వైరస్ తినేస్తుంది
బహుశా ఇదో యుగాంతం ఏమో
కారణాలు అనేకం
మనిషి పోకడలు
జీవన విధానం
ఇలా ఎన్నో కారణాలు
మానవుడి స్వార్థానికి
ఇదే హెచ్చరిక
ప్రకృతి తిరుగుబా టే
ఈ కరోనా ప్రళయం
గమనించు మనిషి
బతుకు పోరాటంలో
జీవితం విలువ తెలుసుకో
ఇప్పుడు యుద్దాన్ని గెలవాలంటే
ఇల్లే అవ్వాలి నీకు జైలు
కర్మ ఫలాలో ఏమో
ప్రపంచం అంతా దీనంగా చూస్తూ
ప్రాదేయపడుతుంది
ఇదొక ప్రపంచ యుద్ధం
అస్త్ర సశ్రాలు లేని యుద్ధం
ఆలోచనలతో
ఆచరణలతో చేసే యుద్ధం
దయచేసి ఆలోచించండి
ఇంట్లోనే ఉండండి
సామాజిక దూరాన్ని పాటించండి
ప్రాణాలను కాపాడుకుందాం

ఇట్లు

కళ్లెం నవీన్ రెడ్డి
సోమారం పేట్
MA., M.Ed.,


Comments

Popular posts from this blog

తండ్రి సంవత్సరిక విధానం....!!

పుస్తకంలో నాకో పేజీ!