Posts

Showing posts from April, 2020

ఆచరణలతో చేసే యుద్ధం

చీకట్లో యుద్ధం కంటికి కనపడని శత్రువు చేసెను విద్వంసం అయోమయం అంతా అగమ్య గోచరం భవిష్యత్ కోసం భయపడిన జనం మనం విలువ తెలిసి రక్షణ ఎట్లా బతకడం ప్రశ్న ప్రపంచం అంతా విస్తరణ ప్రకృతికి మానవుడు తినేస్తే వీడిని వైరస్ తినేస్తుంది బహుశా ఇదో యుగాంతం ఏమో కారణాలు అనేకం మనిషి పోకడలు జీవన విధానం ఇలా ఎన్నో కారణాలు మానవుడి స్వార్థానికి ఇదే హెచ్చరిక ప్రకృతి తిరుగుబా టే ఈ కరోనా ప్రళయం గమనించు మనిషి బతుకు పోరాటంలో జీవితం విలువ తెలుసుకో ఇప్పుడు యుద్దాన్ని గెలవాలంటే ఇల్లే అవ్వాలి నీకు జైలు కర్మ ఫలాలో ఏమో ప్రపంచం అంతా దీనంగా చూస్తూ ప్రాదేయపడుతుంది ఇదొక ప్రపంచ యుద్ధం అస్త్ర సశ్రాలు లేని యుద్ధం ఆలోచనలతో ఆచరణలతో చేసే యుద్ధం దయచేసి ఆలోచించండి ఇంట్లోనే ఉండండి సామాజిక దూరాన్ని పాటించండి ప్రాణాలను కాపాడుకుందాం ఇట్లు కళ్లెం నవీన్ రెడ్డి సోమారం పేట్ MA., M.Ed.,

నేటి సమాజం

Image
✍️కె.ఎన్.ఆర్✍️ ఎదుటి వ్యక్తిని విమర్శించడం చాలా తేలిక ఈ సమాజానికి.... అదే సమాజానికి ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించడం చాలా కష్టం... ఎదుటి వారిని విమర్శించడం వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు.. ఎదుటి వ్యక్తిని ఒకసారి ప్రోత్సహించి చూడు,  ఆ ప్రోత్సాహం అతని విజయానికి మార్గదర్శకం అవుతుంది. ఆ ప్రోత్సాహం లో అతని ఆనందం తో పాటు నీ ఆనందం కూడా కలిసి ఉంటుంది. మీ వ్యక్తిత్వం అభివ్యక్తం కావాలంటే మంచిని ప్రోత్సహించండి.. నలుగురి నాలుకలో గొప్పగా ఉండండి వీలైతే మంచిని మంచి అనండి కానీ చెడుగా కాదు న్యాయంగా ఉండండి కె.ఎన్ ఆర్ అభ్యుదయ కవి