Posts

Showing posts from July, 2023

రెప్పపాటు జీవితం...!!!

Image
కనిపించేది నేను కాదు కేవలం శరీరమే! నా ఆలోచనలే నావి మిగతావేవి నావి కావు అవన్నీ స్వల్పమే! నేనిక్కడ కొన్నాళ్లపాటే  ప్రయాణం చేస్తాను ఒకరోజు ఆ ప్రయాణం ఆగిపోతుంది మనకే తెలియకుండా మన కథ ముగుస్తుంది ఇంతమాత్రానికి నేనెందుకు అహం ఇహం అంటూ బతకాలి  అందుకే నాలా నేను జీవిస్తాను! ఒకరోజు ఈ దేహాలన్నీ  ఊరు చివరన చేరబడతాయి ఈ పలికే మాటలన్నీ  ఒకరోజు మూగబోతాయి నీదని నాదని  విర్రవీగి బతికిన దేహాలు దాహానికి దూరం అవుతాయి అవును ఇక్కడెన్నో దేహాలు పాతిపెట్టబడ్డాయి చరిత్ర పుటల్లో దాగిన సత్యాలను చూపిస్తూ....! అశాశ్వతమైన ఈ జీవన కాలగమనంలో  అస్పష్టంగా ఒకరోజు అన్నీ అక్కడే ఊరిచివరన తలదాచుకుంటాయి! అర్థరహిత ఉనికిది ఈ దేహం దానికి నిర్వచనాలతో పనేముంది? శ్వాసనిశ్వాసలు విఛ్ఛిన్నమౌతూ ప్రాణం నీ నుండి దూరం అవుతున్న సమయంలో నీ ఆత్మకు సమాధి నీ దేహం మాత్రమే అలాంటిది ఆ దేహానికి నిర్వచనాలతో పనేముంది? మనసనే ఒక ఉద్వేగాన్ని అర్దం చేసుకోక ఆప్యాయతల, అనురాగాలను తుడిపేసి ఇంత కాలాన్నీ గడిపావు కదా నీ ఆలోచనలకు జీవిత ఆంతర్యం ఏంటో అర్దం కాలేదా? ఈ కనిపిస్తున్న దేహం ఒకరోజు కనుమరుగవుతుందని తెలియలేదా? రెప్పపాటు జీవితమే...