Posts

Showing posts from February, 2022

శ్మశానం!

అదొక నిశబ్ద మందిరం అక్కడెన్నో ఓటములు విజయాలు  ఎన్నో మౌనాలు ఎన్నో తగాదాలు ఎన్నో పగలు ఎన్నో ద్వేషాలు అర్దం ఉన్నవి అర్దం లేనివి అన్ని అక్కడే తలదాచుకున్నాయి అవును అన్ని అక్కడే తలదాచుకుంటాయి! నీ వ్యక్తిత్వం పై అంటించుకున్న మరకలు నువ్వెంత ఉరకలు పెట్టిన  గొప్పవైతే చరిత్ర అవుతుంది కాకపోతే నీదొక పుట్టుక మరణం అంతే అర్థంలేని పుట్టుక వ్యర్థమే  అశాశ్వతమైన ఈ జీవన కాలగమనంలో  అస్పష్టంగా ఒకరోజు అన్నీ అక్కడే తలదాచుకుంటాయి! శ్మశానం అందరినీ హక్కున చేర్చుకుంటూ అప్పుడప్పుడు భాధలకు సంతోషాలకు ప్రేమలకు కొన్ని విలువలకు అర్థాలను నేర్పిస్తూ  ఆ గొప్ప ప్రదేశంలో ఎన్నో హృదయాలను కంటతడి పెట్టిస్తుంది మనిషి పుట్టుక మొదలు గిట్టేదాక చేసే ప్రయాణంలో చివరి గమ్యస్థానం శ్మశానం మాత్రమే! కళ్లెం నవీన్ రెడ్డి అభ్యుదయ కవి

మౌనం!

Image
బతకడం వేరే జీవించడం వేరే బతికేవాల్లకు నేనర్దం కాను జీవించేవాల్లకు మాత్రమే అవుతా! ఇదర్దం కానీ వారిమధ్య అప్పుడప్పుడు  మౌనం వహిస్తూ అక్షరాలతో స్నేహం చేస్తూ అర్ధమయ్యే వారికి అర్థమవుతూ కానివారికి కాకుండా నేనిలా నాదైన దారిలో మట్టి శిల కావడానికి ఎన్ని యుగాలో కానీ  హృదయం రాయిగా మారడానికి  ఒక్క మౌనం చాలు కదా ఎన్నో ఆటుపోట్లు ఎన్నో నమ్మకద్రోహాలు మౌనానికి నిదర్శనం అయినప్పుడు ఆ మౌనం కచ్చితంగా కొన్ని విస్పోటనాలను కొన్ని యుద్ధాలను చేయగలదు! కచ్చితంగా ఒకానొక రోజు తక్కువ ఎక్కువ కాగలదు ఎక్కువ తక్కువ కాగలదు ఈ ఎగిసి పాటు ఆ మిడిసి పాటు కలకాలం కాదనేది వాస్తవం! కళ్లెం నవీన్ రెడ్డి అభ్యుదయ కవి 9963691692