రవి మళ్లిరావా!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgNsPiqLjupd9SudHmFPTlnc5XT7iZzNNm2t56N6x4svMEEI0xvSKs0v1oyXwe-rEOkNoVZlR5Ut6xRZbOBCjA_V0VpAVsty46CpbX_gnc8Ks5a4gMkAJ8QspjNQX5lc9yxEtTyZhqUi2Y/s1600/1631866235831092-0.png)
మా మద్యకు మళ్లిరావా ఉదయించే "రవి"లా! నువ్వు విడిచిన ప్రాణవాయువు దేశ పతాకములో రెపరెపలాడుతూ నిలిచింది అవును నువ్వు చనిపోలేదు ఈ దేశపు జెండావై నిలిచావు రవి మళ్లిరావా ఓసారి! అమ్మపెట్టిన గోరుముద్దలు తినలే ఏడిస్తే జో కొట్టే జోలపాటలు వినలే ఉక్కు ఉంగా అనిచెప్పే అమ్మ మాటలు వినలే కానీ అలా చెప్పే ఎంతో మంది అమ్మలకు కొడుకయ్యావు బార్డల్ లో సైనికుడివై! ఇప్పుడు మాకు కన్నీళ్లు మిగిల్చి అమరుడయ్యావు! చిన్నప్పుడే తల్లి మేనమామ అత్త చేతిలో పెట్టి చనిపోతే తల్లి ప్రేమకు దూరమైతే అమ్మనాన్నలతో పోల్చకున్నా కానీ అమ్మానాన్నలే అంతా వాళ్ళే అయ్యి విద్యాబుద్దులు అందించారు కొడుకులెక్క వాళ్ళలో కలుపుకున్నారు తండ్రి దగ్గర పెరగలేదు కానిప్పుడు తండ్రి కూడా లేడు తల్లి తండ్రి ప్రేమలు తెలియవు కానీ దేశం మీద ప్రేమ దేశమంటే ప్రాణం నరనరాన నింపుకున్నావు! రవి మళ్లిరావా మా మద్యకు! కె.ఎన్.ఆర్ అభ్యుదయ కవి