పుస్తకంలో నాకో పేజీ!
చరితకై తపన భావాల సంపదను పోగేసుకుని అక్షరమై జీవించాలని ఆరాటపడుతూ కాలంతో నా కలం పరిగెత్తుతుంది! తెల్లని పొలంలో నల్లని విత్తులేసుకుని మొలకెత్తించి చెడు వ్యక్తిత్వాలపై యుద్దం చేస్తుంది! సమాజంలో జరిగే ఆకృత్యాలపై నా అక్షరం ఒక విప్లవం నా అక్షరం ఒక కిరణం నా అక్షరం ఒక కెరటం గర్జించే నా గళమే ఆయుధం బాధాతప్త హృదయాలను స్పృశిస్తూ వ్యవస్థను ప్రశ్నించే కవిత్వం రాస్తూ కలానికి వ్యక్తిత్వాన్ని జోడించి నా వంతుగా కవిత్వం రాస్తా! నిగ్గదీసి నిజాలు చెప్పేందుకు కలం కాలంతో సాగేందుకు నాలోని మానవత్వాన్ని దారపోస్తాను! చరిత్ర పుటల్లో నిలవడానికి ప్రయత్నిస్తాను! నా బ్రతుకు కావ్యంలో హృదయాన్ని ఊయలలూగించే రచనలే చేస్తాను! ఒక్క సిరాచుక్క వికసించే వివేకమే కదా ఇదే నా వ్యక్తిత్వ సంపద నా జీవిత పుస్తకంలో చిరిగిన పేజిలేన్నో ప్రతి పేజీలో నేర్చుకున్నా విషయాలెన్నో! ఈ ప్రపంచం అంతా కూడా అన్నీ ఎవరికి తెలియని ఊర్లతో ఈ సమాజం నిండివుంది. అందులో ఏ మూలనో ఏ కొననో నీ ఉనికనేది! నీదనేది ఏది లేకుండా చేసే ఒకరోజు వచ్చినప్పుడు ఏది చేయకుండా నీపేరు ఇక్కడ లిఖించకుండా వెళ్తావో ఆ జన్మ నిరర్థకమే! బతుకంటే కేవలం బతకడమే కాదు జీవించడం కదా! చరిత్ర పుస్...