మనిషేందుకో విర్రవీగుతున్నాడు
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjfI-113ABAVvJbLygzfA66hkfFKS91XcjWU4Yx-nC9rThQOYAml1sW1c5Npx-6fLXlRfoCsxYRxSoocyhsbgsPn4W82YvYGt9XDAaiI8OqFsAGikAkN-8uIRwtDRjBFsAWVhcLNvx77Gw/s320/IMG_20200521_182014.jpg)
❤️కె.ఎన్.ఆర్❤️ మనిషేందుకో విర్రవీగుతున్నాడు స్వల్పకాలిక ఆనందాల కోసం మరణం అనేది మరిచి విర్రవీగుతున్నాడు విలువలు చెరుస్తున్నాడు ఒకరోజు మృత్యు ఒడిలోకి వెళ్లి అదరాన్ని తాకవలసిందే కదా! నిద్రించిన తన మనసు తట్టిలేపక అందకారము అనే చెరసాలలో బంది అయ్యి మమతల తడులు మట్టుపెట్టి అనురాగాల ఆత్మీయత ను కత్తిరిస్తూ మనిషికి మనిషికి అంతరాలు సృష్టించే పాశవిక మేదావులే చుట్టూ ఎదగడం అంటే ఎంటో తెలియని మూర్ఖపు మనుషులే నేడు.... విలువల ను విష వలయం చేస్తూ మంచి ని పాతిపెట్టి చెడుని నెత్తికెక్కించుకునే అవసరాల స్నేహాలే నేడు ఎన్ని అవతారాలు ఎత్తిన అన్యాయం న్యాయం కాదు కదా! తప్పు ఒప్పు కాదు కదా! నీతిగా మసులుకొలేని ఓ మనిషిగా ఉండటం చేతకాలేని ఓ మనిషిగా నటిస్తూ అయిన మనిషేందుకో విర్రవీగుతున్నాడు! మనిషేందుకో విర్రవీగుతున్నాడు! నవీన్ రెడ్డి అభ్యుదయ కవి