Posts

Showing posts from December, 2024

ఏదీ అడ్డు కాదు!

Image
మొలకెత్తే లక్షణం ఉన్నది ఏదీ అడ్డుగా ఉందని అనుకోదు అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకుంటూ ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అత్యవసరం అయినప్పుడు అడ్డుగా ఉన్నప్పుడు తొలగిస్తూ పక్కకు తోస్తూ వెళ్తూనే ఉండాలి ప్రతి కదలిక వ్యవస్ధకు సమాధానమయ్యే ఉంటుంది తాత్కాలిక చర్యలతో శాశ్వతమైన అంశాలను చేరలేము కాబట్టి ప్రతి కదలిక జీవితంలో అద్భుతంగా ఉండాలి ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి వాటిని అధిగమిస్తూ నీదైనా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండాలి! అద్భుతమైన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు వస్తాయని సృష్టించబడతాయని గొప్ప స్థాయికి చేరిన వాళ్లకు కూడా తెలుసు ఆ బండ రాళ్లవంటి వారికి  ఆ చెట్టు విలువ తెలియకపోవచ్చు ఆ చెట్టులా నిలవాలని కూడా తెలియకపోవచ్చు!! - Kallem Naveen Reddy