ఆమె మా ఇద్దరి ప్రేమ!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEisCI4vPJomJQmNpnFOlimha4Ykgh-I3_Mbvv8iry9BMWe0rHi5Z5WwmkLyfqQWhc9z_uq7N7TW55PynxNbXmteSDwRute2t5_tMdbGrY9fERPhq_LN3P1sQEkZQvofHRrY8IP8ZHMB74I/s1600/1696059338468325-0.png)
లొంగని ప్రేమిది చూస్తుండగానే నా చిన్నకూతురు పుట్టి నెలైంది!❤️😍 నా గుండెలపై ఎత్తుకున్నప్పుడు బుడి బుడి అడుగులతో ఆమె లేత పాదాలు తాకినప్పుడు నా హృదయం భరించలేనీ పారవశ్యం పొందింది! ఆమెను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఏ అక్షరాలకు కూడా లొంగని ప్రేమను నేను అనుభవించాను! ఊహలు ఎంత అనంతంగా ఉంటాయో ఆ అనంత విశ్వాల రహస్యాన్ని ఆమె లేలేత చేతులను ముద్దాడినప్పుడు నా కళ్ళముందే సజీవంగా ప్రత్యక్షంగా చూసాను! అవును ఏ భావాలకు కూడా అందని అవ్యక్తమైన సందర్భమది! జీవితపు రహస్యాల తాత్వికతను నాకు ఇద్దరు కూతుళ్ళు పుట్టినప్పుడు వాళ్ల తొలి ఏడుపులోనే తెలుసుకున్నాను! ఈ సృష్టి కార్యంలో జరిగే ప్రతి సందర్భం కూడా అనేక లోతులుగా వ్యాప్తి అయ్యి ఉంటుంది ఆ లోతులను అనుభవిస్తూ ప్రతి సందర్భాన్ని గొప్పగా ఆస్వాదిద్దాం!! #1MonthCompleted #mylittlePrincess 😍❤️❤️ - Kallem Naveen Reddy