సచ్చిపోతే!
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmWH9dAF6TU9uyRXdgXmxKEBlkxCgc2fEa8ElmbF01a7xVILfnwmLGI-A1qLkrk4gR5DeueFX8t_zwBixAAdtMF_ZVKbr6P4PV_wc7R1qizGQLuAqPbbjgRaLzg3JqKdYIzta1m9-Sl3A/s1600/1635345671268285-0.png)
ఎలా బతికిన చివరికి చనిపోతామని మనిషినని మరిచి బతుకుతున్నావా!? అయితే నువ్వు చనిపోయేవరకే అన్నమాట నీ ప్రస్తావన సచ్చాక కూడా గొప్ప బతుకు ఉంది తెలుసా! ఎప్పుడైనా ఆలోచించావా? అయితే ఒకసారి నా హృదయంలోకి తొంగిచూడు ఆలోచనల అడుగు భాగాన్ని తాకు గొప్పగా కనిపిస్తాయి అవును సచ్చిపోతే మనమే పోతాము నాది నాది అనుకున్నవన్నీ ఇక్కడే అలాగే ఉంటాయి అన్ని వదిలేసి మనమే పోతాము ఏది నీతో రాదు ఏది నీది కాదు శాశ్వతం పేరే మంచి చెడు అంతే అనుకోకుండా ఒకరోజు అన్ని ఇక్కడే వదిలి వెళ్తాము చివరివరకు నీతో ఏది రానప్పుడు నీదేది కానప్పుడు స్వల్ప కాలిక జీవితానికి ఒకరిని చూస్తే అసూయ,స్వార్థం ఎందుకు!? నువ్వే ఇక్కడ శాశ్వతం కానప్పుడు వాటికి శాశ్వతం ఉందా!? వ్యక్తి ఈ సంగతిని మరిచి బతుకుతున్నాడు అసలెందుకు బతుకుతున్నామో తెలియాలి నీకు ఒక శాశ్వత ముద్ర లేకపోతే సచ్చిపోయాక ఉనికిని కోల్పోతే ఎట్లా! ఇప్పుడు బతికున్న ఓ ఎముకల గూడువు మాత్రమే కదా వివేకానంద పుట్టాడు , చనిపోయాడు గాంధీ, అంబేడ్కర్, చంద్రబోస్, ఇలా ఎందరో పుట్టారు చనిపోయారు కానీ వాళ్ళు పుట్టి నిలిచి పోయారు! మనం కొలిచేలా పోయారు! ఒరె అయ్యా మరి మనం ఆ కోవలో ఉంటామా!? జయంతినాడో వర్ధంతినాడో ...